ప్రభుత్వంలో అవినీతి ముమ్మాటికీ వాస్తవం : మళ్లీ విరుచుకుపడ్డ బీజేపీ ఎమ్మెల్సీ
ABN , First Publish Date - 2021-06-18T18:32:25+05:30 IST
ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ మళ్లీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో
బెంగళూరు : ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ మళ్లీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో అవినీతి ఉందన్న మాట ముమ్మాటికీ వాస్తవమేనని వ్యాఖ్యానించారు. సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారని, ప్రజలందరూ ఆయన జోక్యం, అవినీతి గురించే చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వ పనితీరు, పార్టీ పనితీరు గురించి తాను ఇన్చార్జీ అరుణ్ సింగ్ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆయన వివరించారు. గురువారం ఇన్చార్జీ అరుణ్ సింగ్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో భేటీ అయ్యారని, దాదాపు 80 శాతం మంది సీఎం యడియూరప్పపై తీవ్ర అసంతృప్తే వ్యక్తం చేశారని వెల్లడించారు. అంతేకాకుండా పార్టీ బతికి బట్టకట్టాలంటే నాయకత్వాన్ని మార్చాల్సిందేనని చాలా మంది చెప్పారని, మంత్రులు కూడా ఇదే విషయాన్ని అరుణ్సింగ్తో తెలిపారని విశ్వనాథ్ పేర్కొన్నారు.