Victory Procession కు అనుమతి లేదు..ఎన్నికల కమిషన్ ప్రకటన

ABN , First Publish Date - 2021-11-02T16:47:18+05:30 IST

దేశంలో మంగళవారం సాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం అనంతరం విజయోత్సవ ఊరేగింపులకు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది...

Victory Procession కు అనుమతి లేదు..ఎన్నికల కమిషన్ ప్రకటన

న్యూఢిల్లీ : దేశంలో మంగళవారం సాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వం అనంతరం విజయోత్సవ ఊరేగింపులకు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. దేశంలోని మూడు లోక్ సభ నియోజకవర్గాలు, 29 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల కౌంటింగ్ ముగిశాక గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయడానికి అనుమతించమని ఈసీ  స్పష్టం చేసింది.గెలుపొందిన అభ్యర్థి అతని అధీకృత ప్రతినిధితోపాటు ఇద్దరు కంటే ఎక్కువమంది వ్యక్తులను అనుమతించమని ఈసీ పేర్కొంది. రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నికల ధ్రువీకరణ పత్రాన్ని అందుకునేటపుడు కూడా అభ్యర్థితో ఇద్దరినే అనుమతిస్తామని ఈసీ తెలిపింది. విజయోత్సవ ర్యాలీలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. 


Updated Date - 2021-11-02T16:47:18+05:30 IST