ఆరెస్సెస్ చీఫ్ చెప్పేవి అబద్ధాలు...Muslim జనాభా తగ్గుతోంది:ఎంపీ ఓవైసీ

ABN , First Publish Date - 2021-10-16T14:58:39+05:30 IST

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు....

ఆరెస్సెస్ చీఫ్ చెప్పేవి అబద్ధాలు...Muslim జనాభా తగ్గుతోంది:ఎంపీ ఓవైసీ

హైదరాబాద్: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారు.మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్ధాలు, సగం సత్యాలతో నిండి ఉందని ఒవైసీ ఆరోపించారు.జనాభా విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ వ్యాఖ్యలను ఒవైసీ విమర్శించారు.ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని పునరావృతం చేశారని, కాని ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు.


బాల్య వివాహాలు, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్‌ల సామాజిక దురాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ ఎంపీ అన్నారు.కశ్మీర్‌లో ప్రజలు ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ నివేదించిన వ్యాఖ్యలపై ఈ సంవత్సరంలో జరిగిన పౌరుల హత్యలను ఒవైసీ ప్రస్థావించారు. దీనివల్ల ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు, సామూహిక నిర్బంధాలతో కశ్మీరు మారిందని ఒవైసీ చెప్పారు.


Updated Date - 2021-10-16T14:58:39+05:30 IST