కిమ్‌కు క్వీన్ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2021-09-16T00:10:57+05:30 IST

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు ఉత్తరం అందింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 నుంచీ స్పెషల్ మెసేజ్ వచ్చింది. బెస్ట్ విషెస్ అందుకోమంటూ కిమ్‌కు, నార్త్ కొరియా ప్రజలకు మహారాణి సందేశం అందించింది. సాధారణంగా ఉత్తర కొరియాతో అంటిముట్టనట్టు ఉండే బ్రిటన్ నుంచీ ఇలాంటి మెసేజ్ ఎవ్వరూ ఊహించరు.

కిమ్‌కు క్వీన్ శుభాకాంక్షలు

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్‌కు ఉత్తరం అందింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 నుంచీ స్పెషల్ మెసేజ్ వచ్చింది. బెస్ట్ విషెస్ అందుకోమంటూ కిమ్‌కు, నార్త్ కొరియా ప్రజలకు మహారాణి సందేశం అందించింది. సాధారణంగా ఉత్తర కొరియాతో అంటిముట్టనట్టు ఉండే బ్రిటన్ నుంచీ ఇలాంటి మెసేజ్ ఎవ్వరూ ఊహించరు. కానీ, కొరియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రిటన్ రాణి ఎలిజబెత్ శుభాకాంక్షలు తెలిపారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికార ప్రతినిధి స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. కిమ్‌కు క్వీన్ పంపిన సందేశం పాఠాన్ని బ్రిటన్ అధికార పత్రిక రోడాంగ్ సిన్మన్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారు. ‘‘డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆప్ కొరియా ప్రజలు తమ జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటోన్న వేళ, వారి చక్కటి భవిష్యత్తుకు, నా శుభాభినందనలు’’ అంటూ రాణి పేర్కొన్నారు. కిమ్ ఉక్కు పీడికిలో ఉన్న నార్త్ కొరియాని ప్రత్యేకంగా ‘డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్’ అనటం మనం కొసమెరుపుగా భావించవచ్చు! 


Updated Date - 2021-09-16T00:10:57+05:30 IST