తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా విజయన్
ABN , First Publish Date - 2021-06-15T14:18:52+05:30 IST
తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డీఎంకే మాజీ ఎంపీ ఏకేఎస్ విజయన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు సోమవారం ఒ
ప్యారీస్(చెన్నై): తమిళనాడు ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డీఎంకే మాజీ ఎంపీ ఏకేఎస్ విజయన్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఏకేఎస్ విజయన్ ఒక సంవత్సరం ఢిల్లీలో తమిళనాడు ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరి స్తారని తెలిపారు. ఈనెల 17న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం గమనార్హం. తిరువారూర్ జిల్లా మన్నార్గుడి సమీపంలోని సిత్తమల్లికి చెందిన ఏకే విజయన్ వయసు అరవయ్యేళ్లు. ఆయన 1999, 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో నాగపట్టినం (రి) స్థానం నుంచి డీఎంకే తరఫున విజయం సాధిం చారు. 2014లో నాల్గవసారి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. నాగపట్టినం జిల్లా డీఎంకే కార్యదర్శిగా పది సంవత్సరాలు పాటు పనిచేసిన ఆయన ప్రస్తుతం డీఎంకే రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు సతీమణి జ్యోతి, కుమార్తె ఒవీయా వున్నారు. విజయన్ తండ్రి ఏకే సుబ్బయ్య సీపీఐ ఎమ్మెల్యేగా వ్యవహరించి, ఆ తరువాత డీఎంకేలో చేరారు.