తుంగభద్రకు తగ్గిన ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2021-07-28T16:52:40+05:30 IST

తంగభద్ర జలాశయానికి ఇన్‌ ఫ్లో కాస్త తగ్గింది. సోమవారం లక్ష 80 వేల క్యూసెక్‌లు ఇన్‌ఫ్లో ఉండగా మంగళవారం 99వేల 383 క్యూసెక్కులు వస్తున్నాయి. జలాశయంలో మంగళవారం సాయం

తుంగభద్రకు తగ్గిన ఇన్‌ఫ్లో

బళ్లారి(కర్ణాటక): తంగభద్ర జలాశయానికి ఇన్‌ ఫ్లో కాస్త తగ్గింది. సోమవారం లక్ష 80 వేల క్యూసెక్‌లు ఇన్‌ఫ్లో ఉండగా మంగళవారం 99వేల 383 క్యూసెక్కులు వస్తున్నాయి. జలాశయంలో మంగళవారం సాయంకాలానికి 96.528 టీఎంసీల నీరు నిల్వఉంది. 22 గేట్లుఎత్తి 68.48 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు బోర్డు చైర్మన్‌ రాజుపుర్‌, సెక్రటరీ నాగమోహన్‌ చెప్పారు. రెండు రోజుల పాటు ఇన్‌ ఫ్లో కొనసాగే అవకాశం ఉన్నట్లు జలాశయ అధికారి చెప్పారు.  


Updated Date - 2021-07-28T16:52:40+05:30 IST