ట్విట్టర్ ఎండీ వ్యవహారం.. హైకోర్టు ఉత్తర్వును సుప్రీంలో సవాల్ చేసిన యూపీ

ABN , First Publish Date - 2021-06-29T18:48:37+05:30 IST

ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ కర్ణాటక ..

ట్విట్టర్ ఎండీ వ్యవహారం.. హైకోర్టు ఉత్తర్వును సుప్రీంలో సవాల్ చేసిన యూపీ

లక్నో: ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిని అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో మంగళవారంనాడు సవాలు చేసింది. ఘజయాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి చేసిన వీడియో వైరల్ కావడంతో మహేశ్వరికి ఇటీవల ఘజియాబాద్ పోలీసులు నోటీసు జారీ చేశారు. దీంతో ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు రక్షణ కల్పిస్తూ కర్ణాటక హైకోర్టు ఆదేశాలిచ్చింది.


'జై శ్రీరామ్' నినాదం చేయాలంటూ కొందరు యువకులు తనను కొట్టినట్టు అబ్దుల్ షమద్ సైఫి అనే వృద్ధుడు పేర్కొన్న వీడియో ఒకటి ట్విట్వర్‌లో సంచలనం రేపింది. మతపరమైన విద్వేషాలను రగిల్చేలా వీడియో ఉందంటూ బజరంగ్ దళ్ నేత ఒకరు ఘజియాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ట్విట్టర్ ఐఎన్‌సి, ట్విట్టర్ కమ్యూనికేషన్స్ ఇండియా, న్యూస్ వెబ్‌సైట్ ది వైర్, పాత్రికేయులు మొహమ్మదు జుబైల్, రాణా అయూబ్‌తో పాటు కాంగ్రెస్ నేతలు సల్మాన్ నిజామి, మస్కూర్ ఉస్మాని, షామా మొహమ్మద్, రచయి సాబ నఖ్విలపై కేసు నమోదైంది. దీనిపై ఘజియాబాద్ పోలీసులు మహేశ్వరికి నోటీసు ఇవ్వగా, ఆయన హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు. దీనిపైనే యూపీ పోలీసులు అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం సవాలు చేశారు.

Updated Date - 2021-06-29T18:48:37+05:30 IST