ఆహ్లాదాన్ని పంచే రూఫ్ గార్డెన్
ABN , First Publish Date - 2021-06-28T08:08:26+05:30 IST
గ్రౌండ్‌లో స్థలం లేదు. కార్ల పార్కింగ్‌కే సరిపోతుంది. ఇక మొక్కలు ఎక్కడ పెంచాలి? అనే వారు టెర్ర్‌సపైన గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు.
గ్రౌండ్‌లో స్థలం లేదు. కార్ల పార్కింగ్‌కే సరిపోతుంది. ఇక మొక్కలు ఎక్కడ పెంచాలి? అనే వారు టెర్ర్‌సపైన గార్డెనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం నిర్మాణసమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంజనీర్‌తో మాట్లాడి నీళ్లు లీకేజీ కాకుండా కొన్ని కెమికల్స్‌ను ఉపయోగించేలా చూడాలి. నీళ్లు సాఫీగా వెళ్లిపోవడానికి ఎగ్ ట్రేస్ లాంటివి ఉంటాయి. వాటిని డ్రెయిన్ సెల్స్ అంటారు. కోడిగుడ్ల ట్రేల మాదిరిగా ఉంటాయి. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. మట్టిపైన పడ్డనీళ్లు జియో టెక్స్‌టైల్ నుంచి డ్రెయిన్‌సెల్స్‌లోకి వచ్చి అక్కడి నుంచి సాఫీగా అవుట్‌లెట్ గుండా వెళ్లిపోతాయి. డ్రెయిన్‌సెల్స్ పైన జియో టెక్స్‌టైల్‌ను పరవాలి. ఇది గొంగడిలా ఉంటుంది. తరువాత దీనిపై మట్టి, దానిపైన కోకోపిట్, ఆ పైన వర్మికంపోస్ట్ వేసి సమాంతరంగా మిక్స్ చేసి వేయాలి.
చివరగా దీనిపైన ఇసుక వేసుకోవాలి. ఇసుక తేమను అందిస్తుంది. దీనిపైన లాన్ పరుచుకుంటే ఎంత వర్షం పడినా కూడా నీళ్లు డ్రెయిన్ సెల్స్‌లోకి వెళ్లి, అక్కడి నుంచి అవుట్‌లెట్ గుండా బయటకు పోతాయి. ఇలా చేయడం వల్ల లాన్ ఎప్పుడూ గ్రీనరీగా ఉంటుంది. ఈ లాన్‌లో రెడీమేడ్ జూలా(మూవింగ్ జూలా) తెచ్చిపెట్టుకుంటే సాయంత్రం వేళల్లో కావలసినంత ఆహ్లాదం లభిస్తుంది. లాన్‌లో వాటర్ ఫౌంటెన్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిజైన్ చేసుకోవడం వల్ల రూఫ్ గార్డెన్ సేదతీరడానికి మంచి ప్రదేశంగా ఉపయోగపడుతుంది. రాత్రి మాత్రమే సమయం దొరుకుతుంది అనుకునే వాళ్లు రూఫ్ గార్డెన్‌ను లైటింగ్స్‌తో తీర్చిదిద్దుకోవచ్చు. పిల్లలు ముట్టుకున్నా షాక్ కొట్టని లైట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి పూర్తి వాటర్‌ప్రూఫింగ్‌తో కూడా ఉంటాయి.
వాటిలోకి నీళ్లు వెళ్లడం జరగదు. లాన్‌లో వాటిని అమర్చుకోవచ్చు. అభిరుచి ఉన్న వాళ్లు గ్రీన్ వాల్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో ఇష్టమైన బొమ్మ లేదా పేరు డిజైన్ చేయించుకోవచ్చు. ధ్యానం చేసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది అనుకుంటే 9 అంగుళాల గోడను కట్టి దానిపై బుద్ధుని బొమ్మను చెక్కుతారు. ఆర్ట్ వర్క్ ఇది. బుద్ధుడు కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటుంది. ల్యాండ్‌స్కేపింగ్ వల్ల శరీరం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం సొంతమవుతుంది.
కె.పి. రావుప్రముఖ ల్యాండ్‌స్కేప్, ఇంటీరియర్ డిజైనర్‌ఫోన్: 8019411199