డ్రై ఫాస్టింగ్‌

ABN , First Publish Date - 2021-08-17T05:30:00+05:30 IST

అధిక బరువు తగ్గడం కోసం ఎంచుకునే ఉపవాసాల చిట్టాలోకి మరో కొత్త విధానం వచ్చి చేరింది. అదే డ్రై ఫాస్టింగ్‌.

డ్రై ఫాస్టింగ్‌

ధిక బరువు తగ్గడం కోసం ఎంచుకునే ఉపవాసాల చిట్టాలోకి మరో కొత్త విధానం వచ్చి చేరింది. అదే డ్రై ఫాస్టింగ్‌. దీంతో ఉండే ఉపయోగాలు, దుష్ప్రభావాలు ఇవే!

అధిక శాతం స్థూలకాయులు అనుసరిస్తున్న డైటింగ్‌ విధానం ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌. డ్రై ఫాస్టింగ్‌ కూడా ఇలాంటిదే! అయితే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌లో ఉపవాసం కొనసాగే విండో పీరియడ్‌లో డికాక్షన్‌, నీళ్లు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చు. అయితే డ్రై ఫాస్టింగ్‌లో వాటిని కూడా తీసుకోకూడదు. డ్రై ఫాస్టింగ్‌లో రెండు రకాలుంటాయి.


సాఫ్ట్‌ డ్రై ఫాస్ట్‌: ఈ ఫాస్టింగ్‌లో ఉన్నవాళ్లు దంతధావనం, స్నానం, ముఖం కడుక్కోవడం కోసం నీళ్లను వాడవచ్చు. 

హార్డ్‌ డ్రై ఫాస్ట్‌: ఈ ఫాస్టింగ్‌లో ఉన్నవాళ్లు నీళ్లకు దూరంగా ఉండాలి.


ఉపయోగాలు

డ్రై ఫాస్టింగ్‌లో నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం శక్తిని ఖర్చు చేయడానికి కొవ్వు మీద ఆధారపడుతుంది. నీళ్లు లేకపోవడం వల్ల శరీరంపై పెరిగే ఒత్తిడి మూలంగా జీవక్రియల పనితీరు కోసం శరీరం శక్తిని అందించే వీలున్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటుంది. అలాగే డ్రై ఫాస్టింగ్‌ వల్ల శరీరంలోని డ్యామేజీ అయిన కణాలు కొత్త కణాలతో భర్తీ అవుతూ ఉంటాయి. ఫలితంగా వ్యాధినిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఈ తరహా ఉపవాసాల వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గి, చర్మపు మెరుపు పెరుగుతుంది.


దుష్ప్రభావాలు

ఎక్కువ సమయాల పాటు ఉపవాసం ఉండడం వల్ల అలసట ఆవరిస్తుంది. డ్రై ఫాస్టింగ్‌లో నీళ్లకు దూరంగా ఉండడం వల్ల ఆకలి పెరిగి, అవసరానికి మించి ఆహారం తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పులూ వేధిస్తాయి. కాబట్టి ఏదైనా వ్యాధి బారిన పడి, కోలుకుంటున్నవాళ్లు, గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు డ్రై ఫాస్టింగ్‌ అనుసరించకూడదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా డ్రై ఫాస్టింగ్‌ అనుసరించకూడదు.

Updated Date - 2021-08-17T05:30:00+05:30 IST