ఇల్లు అందంగా ఉండాలంటే...

ABN , First Publish Date - 2021-06-23T09:02:28+05:30 IST

చిన్న ఇల్లు అయినా అందంగా ఉంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది.

ఇల్లు అందంగా ఉండాలంటే...

చిన్న ఇల్లు అయినా అందంగా ఉంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది. దీనికి గొప్ప ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సులు చదవాల్సిన అవసరం లేదు. మంచి పెయింటింగ్స్‌ హాల్లోని గోడకు ఫిక్స్‌ చేయడం వల్ల చూడానికి అందంగా ఉంటుంది. గోడకు అతికించిన టీవీవెనకాల సాలెపురుగు వలలా వైర్లు ఉంటే వాటిని ఓ చెక్కబాక్స్‌లాంటిది గోడకు పెట్టి దాంట్లో వాటిని ఫిక్స్‌ చేయాలి. ఆ బాక్స్‌మీద అలంకారానికి ఏదైనా పెట్టొచ్చు. ఇంట్లో సోఫా చెదురుముదురుగా ఉంటే ఓ మూలకు తీసుకెళ్లి పెడితే స్పేస్‌ కనిపిస్తుంది. పాత ఫర్చీచర్‌తో పాటు కొత్త ఫర్నీచర్‌ వస్తువులు ఉంచితే డిఫరెంట్‌లుక్‌లో హాల్‌ కనిపిస్తుంది.


ఇంట్లో వెలుతురు ధారాళంగా ఉండకుంటే మాత్రం కొత్త లైట్స్‌ చూడండి. డిఫరెంట్‌ కలర్‌ బల్బులు ఇంట్లో అమర్చండి. కొత్త లుక్‌లో ఇల్లు కనిపిస్తుంది. బెడ్‌రూమ్‌లో కూడా మంచి ఆర్టిస్టిక్‌ పెయింటింగ్స్‌ను అమర్చాలి. ఏ వస్తువు ఎక్కడ ఉంచితే అందంగా ఉంటుందో మీరే కాస్త బుర్రపెట్టి ఆలోచిస్తే సరి. మీకే అర్థమవుతుంది. మీ ఇల్లును ముందు బావుందని ఫీల్‌ అవ్వండి. ఇతరులతో పోల్చి కాకుండా.. మీకున్న వస్తువులను ఎలా అమర్చాలన్నదే మీ క్రియేటివిటీకి కొలమానం. ఇంటిపైన ఆరిపోయినట్లు వెలిగే డింబ్‌ లైట్లు ఉండటం వల్ల చూడటానికి హాయిగా ఉంటుంది. సరి కొత్తఫీల్‌ను ఇస్తుంది. 

Updated Date - 2021-06-23T09:02:28+05:30 IST