ఇంటికి రంగులతోనే అందం!
ABN , First Publish Date - 2021-08-23T05:54:35+05:30 IST
నూతనంగా నిర్మించుకున్న ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే నాణ్యమైన, నప్పే రంగులు ఎంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఏలివేషన్‌ను బట్టి రంగులు డిజైన్ చేసుకోవాలి. ప్రస్తుతం కంప్యూటర్ గ్రాఫిక్స్..
నూతనంగా నిర్మించుకున్న ఇల్లు మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే నాణ్యమైన, నప్పే రంగులు ఎంచుకోవాలి. ముఖ్యంగా ఇంటి ఏలివేషన్‌ను బట్టి రంగులు డిజైన్ చేసుకోవాలి. ప్రస్తుతం కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇంటి ఫొటోను తీసి ఆ టెక్నాలజీ సహాయంతో ఏయే రంగులు సూటవుతాయో తెలుసుకోవడం చాలా సులువు. అయితే టెక్చర్ పెట్టుకుంటారా? స్టోన్ క్లాడింగ్ చేయించుకుంటారా? అనేది ముందు నిర్ణయించుకోవాలి. రోమ్ లుక్, ఇటాలియన్ లుక్, స్పెయిన్ లుక్... ఇలా ఏది నప్పుతుందో కంప్యూటర్ సహాయంతో డిజైన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కంపెనీ ప్రతినిధులు వచ్చి ఏ పెయింట్ ఎలా ఉంటుందో వచ్చి శాంపిల్స్ చూపిస్తున్నారు. వాళ్ల సహకారం తీసుకోవచ్చు.
నిర్మాణం పూర్తయ్యాక మొదటి కోట్ ప్రైమర్ వేయాలి. అది కూడా బ్రిటిష్ పెయింట్ వేసుకుంటే మంచిది. తరువాత వాల్ పుట్టీ రెండు సార్లు పెట్టించాలి. 107 సాండ్ పేపర్ కొట్టాలి. ఈ పనిపూర్తయిన వెంటనే పెయింట్ వేయకూడదు. వారం రోజుల పాటు వదిలేయాలి. తరువాతే పెయింట్ పని ప్రారంభించాలి. ఏలివేషన్ డిజైన్ చేసుకోవడం వల్లనే కలర్ కాంట్రాస్ట్ తెలుస్తుంది. కలర్ మాత్రమే కాకుండా సరైన ప్రదేశంలో లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంటికి తగిన అందం వస్తుంది.
నాలుగు రోజులు వర్షాలు కురిస్తే ఇంటి గోడలపై నల్లటి గీతలు కనిపిస్తుంటాయి. ఫంగస్ చేరడం వల్ల అలా తయారవుతుంది. యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండే పెయింట్స్ వేయడం వల్ల ఆ సమస్య రాకుండా ఉంటుంది. తక్కువ ధరలో లభించే పెయింట్స్ ఎంచుకోకూడదు. ముఖ్యంగా బయటి గోడల (ఎక్స్‌టీరియర్)కు వేసే రంగులు నాణ్యమైనవిగా ఉండాలి. ల్యామినేటెడ్ పెయింట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఖరీదైనా వాటిని ఎంచుకుంటే ఇల్లు ఆకర్షణీయంగా కనిపించడంతో పాటు సురక్షితంగా ఉంటుంది. ఇక గేటుకు చాలామంది రెడ్ ఆక్సైడ్ వేస్తారు. అది కాకుండా జింక్ ఆక్సైడ్ వేయాలి. ఇది యాంటీ రస్ట్ ప్రూఫ్ టెక్నాలజీతో తయారైనది కాబట్టి తుప్పు పట్టడాన్ని నిరోధిస్తుంది.
కె.పి. రావు, ప్రముఖ ల్యాండ్‌స్కేప్, ఇంటీరియర్ డిజైనర్
ఫోన్ : 8019411199