నాకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారణం ఆయనే.. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-22T19:49:53+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఓ ఫైర్‌బ్రాండ్. తెలంగాణ సీఎం పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే తన లక్ష్యమని చెబుతున్నారాయన

నాకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారణం ఆయనే.. ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కేలో రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఓ ఫైర్‌బ్రాండ్. తెలంగాణ సీఎం పీఠంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయడమే తన లక్ష్యమని చెబుతున్నారాయన. కాంగ్రెస్‌లోని సీనియర్లు, హేమాహేమీలు అందరూ వద్దని అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా తనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారణం కేసీఆరే అని చెబుతున్నారు. ఇంట్లో పడుకున్న కేసీఆర్ వెంటాడి వేధించారనీ, జైల్లో పెట్టించారనీ, ఆ పరిణామాల వల్లే కేసీఆర్‌ను ఎదుర్కొనేది రేవంత్ ఒక్కడే అన్న నమ్మకం తెలంగాణ సమాజానికి కలిగిందని రేవంత్ అంటున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌తో కాంగ్రెస్ యుద్ధం చేస్తోందనీ, ఆషామాషీతో చేస్తే బతకమని తేల్చేస్తున్నారాయన. అందుకే కోవర్టులను పార్టీ నుంచి వెళ్లిపొమ్మని స్పష్టంగా చెప్పేశామన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.


‘నేను ఒక లైన్ తీసుకుంటే దాన్ని వదలను. సాధిస్తాను. కేసీఆర్ డిక్టేటర్ కాదు. ఛీటర్. అప్పుడే కాళ్లు పట్టుకుంటాడు. లైన్ తప్పిందంటే జుట్టు పట్టుకుంటాడు. నేను చచ్చిపోతే కాంగ్రెస్ జెండాను కప్పుకునే చస్తానని అన్న వాళ్లను, టీడీపీ జెండాను కప్పుకునే చస్తాను అని ప్రకటనలు ఇచ్చిన వాళ్లను కొద్ది గంటల్లోనే టీఆర్ఎస్‌లోకి కేసీఆర్ రప్పించేస్తారు. ఏం చేసి వాళ్లను పార్టీలోకి చేర్చుకుంటారనేది ప్రజలకు తెలిసిన రహస్యమే. ఈ క్షణంలో కేసీఆర్‌ను ఓడించి ఆయన్ను అడవుల్లోకి పంపించాలని నాకు ఉంది. కేసీఆర్ దిగిపోవడం ఖాయం. కేసీఆర్ సీఎంగా ఉండటానికి పనికొస్తున్న ఏకైక పార్టీ బీజేపీ. అమిత్ షా, నరేంద్రమోదీ, కేసీఆర్.. విస్కీసోడాలాగా కలిసిపోయి ఉన్నారు. ఈ తెలంగాణ సమాజం సోనియాగాంధీకి ముడుపు చెల్లించాల్సిన అవసరం ఉంది’ అంటూ రేవంత్ రెడ్డి తేల్చేస్తున్నారు. ఇంకా ఎన్నో విషయాలను ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొని వివరించారు. ఆ కార్యక్రమ వివరాలు ఈ ఆదివారం రాత్రి 8.30గంటలకు మీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీలో..

Updated Date - 2021-10-22T19:49:53+05:30 IST