సంస్కృతీ, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
ABN , First Publish Date - 2021-11-02T03:56:00+05:30 IST
ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయా లను భావితరాలకు అందించా లని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. సోమవారం మండలం లోని చిన్నసాకడ, మోడి, చొపన్ గూడ గ్రామాల్లో దండారి ఉత్స వాల్లో భాగంగా ఎత్మసార్, గుస్సా డీ దేవతలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
- ఎమ్మెల్యే ఆత్రం సక్కు
కెరమెరి, నవంబరు 1: ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయా లను భావితరాలకు అందించా లని ఎమ్మెల్యే ఆత్రంసక్కు అన్నారు. సోమవారం మండలం లోని చిన్నసాకడ, మోడి, చొపన్ గూడ గ్రామాల్లో దండారి ఉత్స వాల్లో భాగంగా ఎత్మసార్, గుస్సా డీ దేవతలకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆదివాసీలతో కలిసి దం డారి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపతా బాయి, ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్‌కుమార్, సర్పంచ్‌లు నానేశ్వర్, జగన్నాథ్ రావు, కుమరంభీంరావు పాల్గొన్నారు.
లింగాపూర్: మండలంలోని ఆదివాసీ గ్రామాల్లో దండారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం లింగాపూర్, మానుకు గూడ, గోండుగూడ, లొద్దిగూడ, దాంపూర్, చిన్నదాంపూర్, మామిడి పల్లి, ఎల్లాపటార్, పిట్టగూడ, నాగుగూడ, చోర్‌పల్లి, మోడిగూడ, ఘు మ్నూరు తదితర గ్రామాల్లో దండారి ఉత్సవాలు నిర్వహించారు. దీపావళి పండగ సందర్భంగా దీపా వళికి ముందు దండారి ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీ. గుస్సాడీ వేషాదారణలో ఆటపాటలతో గ్రామాల్లో సందడి నెలకొంది.