ఘనంగా సంక్రాంతి సంబురాలు
ABN , First Publish Date - 2021-01-16T06:52:30+05:30 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలో ముచ్చటగా మూడు రోజులు సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకున్నారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 15 : నిర్మల్ జిల్లా కేంద్రంలో ముచ్చటగా మూడు రోజులు సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందోత్సాహలతో జరుపుకున్నారు. భోగి, మకర సంక్రాంతితో పాటు కనుమ పండుగలో మహిళలు ఆసక్తిగా పాల్గొ న్నారు. ఇళ్ల ఎదుట తీర్చిదిద్దిన రంగవల్లికలు అమితంగా ఆకట్టుకున్నాయి. పిల్లలు, పెద్దలు సంక్రాంతి సంబురాల్లో మునిగితేలారు. గాలిపటాలు ఎగుర వేస్తూ యువత ఉత్సాహం పంచుకున్నారు. గంగిరెద్దుల వారు గంగిరెద్దులు ఊరేగిస్తూ సందడి చేశారు. పలువురు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహించారు. శ్రీ వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. చివరిరోజు గురువారం దేవర కోట, హరిహర క్షేత్రం, రామాలయంలో నిర్వహించిన గోదా కల్యాణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి సంక్రాం తి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఈ సందర్భంగా ప్రజలు సుఖ సంతోషా లతో ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్పస్వాములు తమ దీక్షను విరమిం చారు.
ముథోల్ : మండలంలోని ఆయా గ్రామాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఆయాగ్రామాల్లో మహిళలు ఉదయం నుండే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం నోములు నోచుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు గాలిపటాలు ఎగరవేశారు. ఒకరికొకరు పండుగ శుభా కాంక్షలు తెలుపుకున్నారు.
కడెం : మండలంలోని అన్నిగ్రామాలలో గురువారం మకరసంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే మహిళలు ఇళ్ల ముందు ముగ్గులు వేసి రంగురంగులతో అలంకరించారు. చిన్నపిల్లలు గాలి పటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడిపారు. అన్ని గ్రామాలలో సంక్రాంతి సం బురాలను ఘనంగా నిర్వహించారు.
ఖానాపూర్ : మండల కేంద్రంలో గురువారం సంక్రాంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే నిద్రలేచి వాకిళ్లలో అందమైన రంగవల్లికలు వేశారు. సాంప్రదాయబద్దంగా నవధాన్యాలు, ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. చిన్నారులు గాలి పటాలను ఎగురవేస్తూ సందడిగా గడిపారు.
కుంటాల, జనవరి 15 : మండలంలోని ఆయాగ్రామాల్లో గురు, శుక్రవారాల్లో సంక్రాంతి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మకర సంక్రాంతిని పురష్కరించుకొని అన్ని గ్రామాల్లో మహిళలు ఉదయం నుండే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులువేసి ఇళ్లను అలంకరించిన అనంతరం నోములు నోచుకున్నారు. పండగ సందర్భంగా గురు, శుక్రవారాలు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.
దస్తూరాబాద్ : మండల కేంద్ర ంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వాకిట్ల ముందు రంగు రంగుల ముగ్గులతో ప్రతి ఇంట్లో పిండి వంటలు, పిల్లలు గాలిపటాలతో సంక్రాంతి పండుగ సందడిగా జరుపుకున్నారు.
ముగ్గుల పోటీలు
సారంగాపూర్ : మండలంలో గల కౌట్ల(బి) సాయిబాబా దేవాలయంలో ఎంప్లాయి అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. అలాగే ప్యారమూర్లో గల శ్రీదత్తఆశ్రమంలో దత్తఆశ్రమం మహారాజ్ శ్రీ అవదూత్ మహారాజ్ ఆధ్వర్యం లో మహిళలకు ముగ్గులపోటీలను నిర్వహించి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్ అట్ల యశోద పోతారెడ్డి, దివ్యారెడ్డిలు ఉన్నారు.