సాత్నాల ప్రాజెక్టుకు జలకళ
ABN , First Publish Date - 2021-06-26T06:53:41+05:30 IST
మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి ఆయా గ్రామాల వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో పాటు మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన సాత్నాలలో భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు జలకళలను సంతరించుకుంది.
జైనథ్, జూన్ 25: మండలంలో ఇటీవల కురిసిన వర్షానికి ఆయా గ్రామాల వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో పాటు మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన సాత్నాలలో భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు జలకళలను సంతరించుకుంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి మట్టం 286.50 మీటర్ల అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 282.30 మీటర్ల నీటి స్థాయి మట్టం ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 1.24 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 444 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో ప్రస్తుతం స్తబ్దంగా ఉంది. సాత్నాల ప్రాజెక్టు కుడి కాల్వ నుంచి 20వేల ఎకరాలు, ఎడమ కాల్వ నుంచి 4వేల ఎకరాలు మొత్తం 24వేల ఎకరాలకు వచ్చే రబీ పంట కాలానికి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందనుండడంపై జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.