డ్రగ్స్ కేసు: కేవలం పూరి జగన్నాథ్‌ను కలవడానికి వెళ్లా: బండ్ల గణేష్

ABN , First Publish Date - 2021-09-01T02:30:09+05:30 IST

డ్రగ్స్ కేసు: కేవలం పూరి జగన్నాథ్‌ను కలవడానికి వెళ్లా: బండ్ల గణేష్

డ్రగ్స్ కేసు:  కేవలం పూరి జగన్నాథ్‌ను కలవడానికి వెళ్లా: బండ్ల గణేష్

హైదరాబాద్‌: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ విచారణ ముగిసింది. దాదాపు 9 గంటలపాటు ఆయన్ను అధికారులు విచారించారు. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘటనపై పూరి జగన్నాథ్‌ను  ప్రశ్నించారు. పూరి జగన్నాథ్‌తో పాటు సినీ నిర్మాత బండ్ల గణేష్‌ సినీ లావాదేవీలపై ఈడీ ఆరా తీశారు. 


ఈ సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ పూరిని కలుద్దామని ఈడీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. పూరిని కలవడానికి ఈడీ అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. పూరి తన మిత్రుడని అందుకే కలవడానికి వచ్చానని బండ్ల గణేష్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసుకూ తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  కేవలం తాను పూరీ జగన్నాథ్‌ను కలవడానికి మాత్రమే వెళ్లానని బండ్ల గణేష్ స్పష్టంచేశారు. 


Updated Date - 2021-09-01T02:30:09+05:30 IST