కృషి భారతం ఆధ్వర్యంలో ఘనంగా పరాశర మహర్షి జయంతి
ABN , First Publish Date - 2021-05-13T02:55:05+05:30 IST
వ్యవసాయ శాస్త్రం, వృక్ష శాస్త్రం వంటి అనేక గొప్ప శాస్త్రాలను రచించిన పరాశర జయంతి సందర్భంగా కృషి భారతం ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో అనేక చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు..
వ్యవసాయ శాస్త్రం, వృక్ష శాస్త్రం వంటి అనేక గొప్ప శాస్త్రాలను రచించిన పరాశర జయంతి సందర్భంగా కృషి భారతం ఆధ్వర్యంలో దేశ విదేశాల్లో అనేక చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికాల్లో పరాశర జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రయాగ్ రాజ్‌లో ప్రత్యేకంగా అనేకమంది ఈ కార్యక్రమాన్ని జరుపుకొన్నారు. అలాగే మన రాష్ట్రంలో కూడా దాదాపు 40 స్థానాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ప్రధానంగా కరీంనగర్‌లోని కాశింపేట గ్రామం, గన్నేరువరంలో ఈ కార్యక్రమాన్ని గొప్పగా జరిగింది. అలాగే ఇల్లంతు కుంటలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భూమి పుత్ర ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో కూడా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా అనేకమంది రైతులు, తదితరులు తమ ఇళ్లలో, ఆన్‌లైన్‌లో పరాశర జయంతిని పుస్కరించుకుని ఆయనకు నమస్కరించుకున్నారు.
కాగా.. కృషి భారతం ఎప్పుడూ కూడా వైదిక వ్యవసాయం, వేద వ్యవసాయం, మహర్షుల జయంతులు గొప్పగా నిర్వహిస్తుందని, అందరికీ ఇలాంటి కార్యక్రమాలపై అవగాహన కల్పింస్తుందని కృషి భారతం వ్యవస్థాపకుడు కౌటిల్య కృష్ణ పేర్కొన్నారు. రైతులకు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అండగా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా మహర్షి జయంతిని పురస్కరించుకుని అనేకమందికి ఓం పరాశరాయ నమః మంత్రాన్ని ఉపదేశం కూడా చేసినట్లు వెల్లడించారు.