సడలింపు సమయం పెంపుతో తగ్గిన రద్దీ

ABN , First Publish Date - 2021-06-01T05:51:40+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపు సమయం మద్యాహ్నం 1 గంట వరకు పెంచటంతోపాటు, 2 గంటల వరకు ఇళ్లకు చేరుకునే వెసులుబాటు ఇవ్వడంతో మార్కెట్‌, షాపింగ్‌మాల్స్‌ వద్ద సోమవారం రద్దీ తగ్గింది.

సడలింపు సమయం పెంపుతో తగ్గిన రద్దీ
వాహనదారులను తనిఖీ చేసి ప్రశ్నిస్తున్న ట్రైనీ ఐపీఎస్‌ ఆఫీసర్‌ రితిరాజ్‌

 కొనసాగిన వాహన తనిఖీలు

కరీంనగర్‌ క్రైం, మే 31: లాక్‌డౌన్‌ సడలింపు సమయం మద్యాహ్నం 1 గంట వరకు పెంచటంతోపాటు, 2 గంటల వరకు ఇళ్లకు చేరుకునే వెసులుబాటు ఇవ్వడంతో మార్కెట్‌, షాపింగ్‌మాల్స్‌ వద్ద సోమవారం రద్దీ తగ్గింది. సడలింపు సమయం ముగిసిన తరువాత మద్యాహ్నం 2 గంటల పుంచి రోడ్లపై ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల్లో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ పోలీసులు గస్తీ నిర్వహిస్తూ  రోడ్లపైన తిరుగే వాహనదారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించారు. సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి సోమవారం రాత్రి కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ లాక్‌డౌన్‌ అమలుతీరును  పరిశీలించారు. 

Updated Date - 2021-06-01T05:51:40+05:30 IST