తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో గద్వాల కవయిత్రి

ABN , First Publish Date - 2021-04-28T04:30:22+05:30 IST

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు లో గద్వాల కవయిత్రి సరితా రవి ప్రకాష్‌ పేరు నమోదయ్యింది.

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో గద్వాల కవయిత్రి
సరిత

గద్వాల రూరల్‌, ఏప్రిల్‌ 27 : తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు లో గద్వాల కవయిత్రి సరితా రవి ప్రకాష్‌ పేరు నమోదయ్యింది. ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని డాక్టర్‌ సినారే వంశీ విజ్ఞానపీఠం, సాహితీకిర ణం మాసపత్రిక, సాంస్కృతిక క ళాసారధి సంయుక్తంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రపంచ మహిళా తెలుగు కవితా మ హోత్సవం-2021 నిర్వహించారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 17దేశాల నుంచి 250 మంది కవయిత్రు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిత ‘అందమైన బా ల్యం’ అనే కవితను వినిపించారు. దీనిని అత్యుత్తమ కవి తగా తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో నమోదు చేశారు. దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని కవయిత్రికి అందించారు. 

Updated Date - 2021-04-28T04:30:22+05:30 IST