కరిగెటలో తిరగబడిన ట్రాక్టర్
ABN , First Publish Date - 2021-09-05T03:49:07+05:30 IST
మండలంలోని వేముల గ్రామ శివారులోని పొలంలో కరిగెట చేసేందుకు వెళ్లిన ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది.
మిడ్జిల్, సెప్టెంబరు 4 : మండలంలోని వేముల గ్రామ శివారులోని పొలంలో కరిగెట చేసేందుకు వెళ్లిన ట్రాక్టర్ తిరగబడిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. వేముల గ్రామానికి చెందిన పోగుల బాలస్వామి తన ట్రాక్టర్‌తో పొలంలో కరిగెట చే స్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనకకు తిరగబడి రోటోవేటర్, స్టీరింగ్ మధ్యన అతను ఇరుక్కున్నాడు. పక్క పొలాల రై తులు గమనించి వెంటనే ట్రాక్టర్ పూర్తిగా కిందపడకుండా ఉంచి డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఏనుగొండలోని ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో రైతులు, గ్రామస్థులు ఊపిరి పిల్చుకున్నారు.