ఉమ్మడి మెదక్‌ జిల్లా జూనియర్‌ వాలీబాల్‌ జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2021-03-10T05:48:35+05:30 IST

ఈనెల 11 నుంచి పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ వాలీబాల్‌ పోటీలకు ఉమ్మడి మెదక్‌ జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు సిద్దిపేట వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాలసాయిరాం తెలిపారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా జూనియర్‌ వాలీబాల్‌ జట్టు ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జూనియర్‌ ఉమ్మడి మెదక్‌ బాలికల జట్టు

సిద్దిపేటసిటీ, మార్చి 9: ఈనెల 11 నుంచి పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ వాలీబాల్‌ పోటీలకు ఉమ్మడి మెదక్‌ జిల్లా బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు సిద్దిపేట వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాలసాయిరాం తెలిపారు. మంగళవారం సిద్దిపేట వాలీబాల్‌ అసోసియేషన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అండర్‌-18 (జూనియర్‌) వాలీబాల్‌ బాలబాలికల జట్లు ఎంపికలు నిర్వహించారు. బాలుర విభాగంలో 230 మంది, బాలికలు విభాగంలో 80 మంది హాజరయ్యారు. ప్రతిభ చూపిన బాలబాలికలను 12 మంది చొప్పున ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. 

బాలికల విభాగంలో డాలి హర్షిత (సంగారెడ్డి), జేరుస (సంగారెడ్డి), సంవర్ధిని(సంగారెడ్డి), రితిక్‌ చౌదరి (సంగారెడ్డి), శ్రావణి (మెదక్‌), శైలజ (మెదక్‌), స్రవంతి (మెదక్‌), ప్రత్యూష (సిద్దిపేట), సుదేశన (సిద్దిపేట), అశ్విని(సిద్దిపేట), అనూష (సిద్దిపేట), స్రవంతి (సిద్దిపేట)ఎంపికయ్యారు. బాలుర విభాగంలో శ్రీరామ్‌ (మెదక్‌) సొహెల్‌ (సంగారెడ్డి) పవన్‌ రాథోడ్‌ (సంగారెడ్డి) శశివర్ధన్‌ గౌడ్‌ (మెదక్‌) శ్రీకాంత్‌ (సిద్దిపేట) శేఖర్‌ గౌడ్‌ (సిద్దిపేట) ప్రశాంత్‌ (సిద్దిపేట) అఖిల్‌ (సిద్దిపేట) బాలాజీ (సంగారెడ్డి) రాజు (మెదక్‌) రాఘవేంద్ర (మెదక్‌) రాము (మెదక్‌) ఎంపికయ్యారు. కార్యక్రమంలో సిద్దిపేట వాలీబాల్‌ అసోసియేషన్‌ క్లబ్‌ ప్రధాన కార్యదర్శి కామిరెడ్డి రవీందర్రెడ్డి, సంగారెడ్డి జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి స్వరాజ్‌, మెదక్‌ జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి రవీందర్‌, మచ్చేందర్‌, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-10T05:48:35+05:30 IST