సంగారెడ్డి కలెక్టరేట్‌లో నో ఎంట్రీ

ABN , First Publish Date - 2021-04-20T05:43:08+05:30 IST

రెండో దశ కరోనా తీవ్రత దృష్ట్యా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి సోమవారం నుంచి ప్రజలను అనుమతించడం లేదు.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో నో ఎంట్రీ
కలెక్టర్‌ ఛాంబర్‌ వైపు వెళ్లే ద్వారాన్ని మూసివేసి కాపలాగా ఉన్న అటెండర్‌

ప్రజావాణి నిర్వహించని అదికారులు

గ్రీవెన్స్‌ సెల్‌లో వినతిపత్రాలు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 19: రెండో దశ కరోనా తీవ్రత దృష్ట్యా సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లోకి సోమవారం నుంచి ప్రజలను అనుమతించడం లేదు. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఉండే ఛాంబర్‌ వైపు ఎవరూ వెళ్లకుండా ద్వారాలు మూసివేసి, అటెండర్‌ను కాపలా ఉంచారు. అలాగే మరో అడిషనల్‌ కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి, రెవెన్యూ విభాగాలు ఉండే బ్లాకులోకి కూడా ఎవరిని వెళ్లనీయడం లేదు. ఈ బ్లాక్‌లోకి వెళ్లే ద్వారం వద్ద టేబిల్‌ను అడ్డుగా పెట్టి, మరో అటెండర్‌ కాపలాగా ఉండి ఎవరినీ అనుమతించడం లేదు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని అధికారులు నిర్వహించకపోవడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ అర్జీలను గ్రీవెన్స్‌ సెల్‌లో ఇచ్చి వెళ్లారు.

Updated Date - 2021-04-20T05:43:08+05:30 IST