మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలి
ABN , First Publish Date - 2021-07-12T06:59:23+05:30 IST
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదివారం వినతిపత్రం అందించారు.
మిర్యాలగూడ అర్బన, జూలై 11 : మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా మార్చాలని కోరుతూ ఎమ్మెల్యే భాస్కర్‌రావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగార్జునసాగర్, మి ర్యాలగూడ నియోజకవర్గాలకు సమీపంలో ఉన్న మిర్యాలగూడ ఏరి యా ఆస్పత్రికి జిల్లా ఆస్పత్రి హోదా కల్పిస్తే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతుందని వివరించారు. అదేవిధంగా ఏ పీ, తెలంగాణ రాషా్ట్రలకు అనుసంధానంగా విస్తరించిన అద్దంకి-నార్కట్‌పల్లి ప్రధాన రహదారిగుండా సుమారు రెండు గంటల వ్యవధిలోనే హైదరాబాద్‌కు చేరుకునే వీలుందన్నారు. అదేవిధంగా స్థానిక ఆస్పత్రిలో వైద్యసిబ్బంది కొరతను ఆయన దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి శాఖాపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని త్వరలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.