రేషన్‌ డీలర్లకు కమీషన్‌ డబ్బులు విడుదల

ABN , First Publish Date - 2021-11-02T06:17:15+05:30 IST

జిల్లాలో రేషన్‌ డీలర్లకు బకాయి పడ్డ కమీషన్‌ డబ్బులు విడుదలయ్యాయి. అక్టోబరు 31న ఆంధ్రజ్యోతిలో ‘డీలర్లకు కమీషన్‌ ఎన్నడో’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు.

రేషన్‌ డీలర్లకు కమీషన్‌ డబ్బులు విడుదల

సూర్యాపేట(కలెక్టరేట్‌), నవంబరు 1 : జిల్లాలో రేషన్‌ డీలర్లకు బకాయి పడ్డ కమీషన్‌ డబ్బులు విడుదలయ్యాయి. అక్టోబరు 31న ఆంధ్రజ్యోతిలో ‘డీలర్లకు కమీషన్‌ ఎన్నడో’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు జిల్లా సివిల్‌ సప్లయ్‌ మేనేజర్‌ రాంపతి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీలర్లకు కమీషన్‌ డబ్బులు రూ.కోటి 3 లక్షలను వారి బ్యాంకు ఖాతాల్లో సోమవారం జమచేశారు. మిగిలిన కమీషన్‌ డబ్బును కూడా త్వరలోనే జమ చేస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-02T06:17:15+05:30 IST