అనుమానస్పదంగా యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-07-09T06:35:48+05:30 IST

అనుమానస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్‌ సెంటర్‌లో గురువారం రాత్రి జరిగింది.

అనుమానస్పదంగా యువకుడి మృతి
శివ

రామగిరి, జూలై 8 : అనుమానస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్‌ సెంటర్‌లో గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. త్రిపురారం మండలం కామరెడ్డిగూడేనికి చెందిన కొంగరి శివ(22) పట్టణంలోని శివజీనగర్‌ సెంటర్‌లో గల ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ, రిలయన్స షోరూంలో సేల్స్‌మెనగా పని చేస్తున్నాడు. ఈ నెల 7న అతడి తల్లి వర్ధంతి ఉండడంతో 6వ తేదీ సాయంత్రమే స్వగ్రామానికి వెళ్లాడు. వర్ధంతి అయ్యాక నల్లగొండకు వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివ రూం ఆరుబయట నిద్రపోగా స్థానికులు అతడి రూంలో పడుకోబెట్టారు. అతని రూమ్‌మేట్‌ నాగరాజు శివకు ఎన్నిసార్లు ఫోన చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో అతడు పక్క రూంలోనే ఉంటున్న పరమే్‌షకి  ఫోన చేసి శివ ఫోన లిఫ్ట్‌ చేయడం లేదని ఒకసారి రూంకి వెళ్లి చూడమని కోరాడు. దీంతో అతడు రూం తలుపులు తెరిచి చూడగా శివ శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామ చేశారు. మృతిపై ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో ఇంకా కేసు నమోదు కాలేదని టూటౌన ఎస్సై నర్సింహులు తెలిపారు. శివ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం ఆత్మహత్యగా భావిస్తున్నారు. మృతుడి ముక్కు, నోట్లో నుంచి రక్తం రావడం చూస్తే హత్యగా అనుమానం వ్యక్తమవుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-07-09T06:35:48+05:30 IST