ఆహ్లాద పరిచేలా అర్బన్‌ పార్కు

ABN , First Publish Date - 2021-12-31T06:32:38+05:30 IST

పట్టణంలోని నీలగిరి నందనవనం అర్బన్‌ పార్క్‌ను సందర్శకులను ఆహ్లాదపరిచేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తెలిపారు.

ఆహ్లాద పరిచేలా అర్బన్‌ పార్కు

 కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ 

నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పట్టణంలోని నీలగిరి నందనవనం అర్బన్‌ పార్క్‌ను సందర్శకులను ఆహ్లాదపరిచేలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ తెలిపారు. నల్లగొండలోని నీలగిరి నందనవనం అభివృద్ధి పనులను డీఎ్‌ఫవో రాంబాబుతో కలిసి కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. పార్క్‌లో పగోడ నిర్మాణం, సివిల్‌ పనులు పూర్తి చేశామని, తుది మెరుగులు పనులు చేయాల్సి ఉందని డీఎ్‌ఫవో వివరించారు. పార్కు ప్రవేశం వద్ద ముఖ్య ద్వారం పనులు ప్రారంభించామని, నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ పనులు పగ్రతిలో ఉన్నాయ ని, రహదారి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయన్నారు. ప్లాంటేషన్‌ పూర్తి చేసినట్టు వివరించారు. పార్కులో 5 సైకిళ్లు, బ్యాటరీ ఆటో, పిల్లలు ఆడుకునేలా పరికరాలు, జంతువుల ప్రతిమలు, సైన్‌బోర్డులు ఏర్పాటు పనులు చేపట్టాలని, అవసరమైన నిధులు మం జూరు చేస్తానని కలెక్టర్‌ అన్నారు. అనంతరం ఆర్టీవో కార్యాలయంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి కేటాయించిన స్థలాన్ని సందర్శించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ నాగార్జున్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-12-31T06:32:38+05:30 IST