మోహినీ అవతారంలో వేంకటేశ్వరుడు
ABN , First Publish Date - 2021-12-31T06:25:44+05:30 IST
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు గురువారం దర్శనమిచ్చారు.
సూర్యాపేట కల్చరల్, డిసెంబరు 30: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. స్వామివారి మోహినీ అవతార విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకుడు నల్లాన్‌చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు భక్తులకు వివరించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులు ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివా్‌సరెడ్డి, అర్చకులు శ్రీహరచార్యులు, సునీల్‌కుమారాచార్యులు, రఘునందనాచార్యులు, కృష్ణయ్య, రవీందర్, రమేష్, కరుణసాగర్‌రెడ్డి, మంజుల, అరుణమ్మ, వాసవి, రజిత, పద్మ, జ్ఞానకుమారి, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మట్టపల్లి నృసింహుడి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహుడి క్షేత్రంలో స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వక్సేన, పుణ్యహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, పంచగవ్యప్రాసన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాంగళ్యధారణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నీరాజనమంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కరోనా దృష్ట్యా ఆలయానికి వచ్చే భక్తులు భౌతికదూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో ధర్మకర్త చెన్నూరి చెన్నూరిమట్టపల్లిరావు, ఈవో సిరికొండనవీన్, అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, కృష్ణామాచార్యులు, రామాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, నరసింహమూర్తి, లక్ష్మినరసింహమూర్తి పాల్గొన్నారు.
వెండి కల్యాణ సింహాసనం బహూకరణ
ఏపీ రాష్ట్రం పిడుగురాళ్లకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వర్లు కుమార్తె, అల్లుడు ఇమ్మడి శ్రీనివాస్, సరస్వతి దంపతులు 7కిలోల వెండితో రూ.7.50లక్షల విలువచేసే కల్యాణ సింహాసనాన్ని అందజేశారు. వీటిని ఆలయ ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, కార్యనిర్వణాధికారి సిరికొండ నవీన్‌కు అందజేశారు.