Comedian Ali Reaction: ఏపీ సీఎం ఇచ్చిన పదవిపై తొలిసారి స్పందించిన అలీ

ABN , First Publish Date - 2022-10-28T13:42:44+05:30 IST

నటుడు అలీని (Ali) ఏపీ ప్రభుత్వం (Ap govt) ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా (Ali as electronic media advisor) నియమించిన విషయం తెలిసిందే..

Comedian Ali Reaction: ఏపీ సీఎం ఇచ్చిన పదవిపై తొలిసారి స్పందించిన అలీ
Ali First Reaction On AP Govt Electronic Media Advisor Post

నటుడు అలీని (Ali) ఏపీ ప్రభుత్వం (Ap govt) ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా (Ali as electronic media advisor) నియమించిన విషయం తెలిసిందే. ఈ విషయం చెబుతూ గురువారం అధికారికంగా ఏపీ ప్రభుత్వం ఓ జీవోని విడుదల చేసింది. రెండేళ్లపాటు ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడి పదవిలో ఉంటారని ఆ జీవోలో పేర్కొన్నారు. అలీకి చెల్లించే జీతభత్యాల, అలవెన్స్‌ గురించి విడిగా ఉత్తర్వులు ఇస్తామని జీవోలో పేర్కొన్నారు. కాగా, ఈ పదవిపై తొలిసారి అలీ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. ‘‘వైసీపీ కండువా కప్పుకున్న మొదటి రోజు నుండి పార్టీ కోసమే పని చేస్తున్నాను. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)గారు కండువా కప్పిన తర్వాత.. అలీ పార్టీని ఉద్దేశించే కదా.. వస్తారు.. పదవులను ఆశించి కాదు కదా.. అన్నారు. అవును సార్ అన్నాను. ఆయనకి తెలుసు.. ఈ మనిషి మనకు ఉపయోగపడ్డాడు. ఈ మనిషి మనం చెప్పగానే ఆంధ్రదేశం మొత్తం కాన్వాస్ చేశాడు. ఈ మనిషికి మనం ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నారు. గతంలో మీడియాలో రాజ్యసభ అని, ఇంకా అనేక పదవుల విషయంలో నా పేరు వినిపించింది. అటు పార్టీ నుంచిగానీ, ఇటు నా సైడ్ నుంచి గానీ ఎప్పుడూ చెప్పలేదు. కానీ అక్కడి నుంచి అధికారికంగా ఏరోజు అయితే న్యూస్ వస్తుందో.. ఆ రోజే ప్రకటిస్తానని మీడియాకు చెప్పడం జరిగింది. గతంలో మేము ఆయనని ఫ్యామిలీతో వెళ్లి కలవడం జరిగింది. ఆరోజు ఏదైతే చెప్పారో.. అది ఈ రోజు కన్ఫర్మ్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నన్ను నియమించినందుకు మా జగన్ మోహన్ రెడ్డిగారికి ధన్యవాదాలు. థ్యాంక్యూ సార్. మీరు ఇచ్చిన ఈ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని, మీ అడుగుజాడల్లో నడుస్తానని.. ఈ సందర్భంగా మాటిస్తున్నాను. ఇది నా కూతురు పెళ్లి సందర్భంగా వచ్చిన ఒక గిఫ్ట్‌గా భావిస్తున్నాను...’’ అని అన్నారు. (Ali First Reaction On AP Govt Electronic Media Advisor Post)

Updated Date - 2022-10-28T13:51:29+05:30 IST