తప్పు తేలితే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-12-02T00:34:38+05:30 IST

ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీడీ శివశంకర్‌ హెచ్చరించారు. మండలంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘నీకింత.. నాకింత’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేపట్టారు.

తప్పు తేలితే చర్యలు తప్పవు
దాదులూరు వద్ద డ్రాగనప్రూట్స్‌ తోటను పరిశీలిస్తున్న ఏపీడీ శివశంకర్‌

ఉపాధి అక్రమాలపై ఏపీడీ.. ‘నీకింత.. నాకింత’ కథనంపై విచారణ

కనగానపల్లి, డిసెంబరు 1: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తప్పవని ఏపీడీ శివశంకర్‌ హెచ్చరించారు. మండలంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో గురువారం ‘నీకింత.. నాకింత’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేపట్టారు. ఏపీడీ ఆధ్వర్యంలో దాదులూరు చింతవనం, డ్రాగన ఫ్రూట్‌ తోటను పరిశీలించారు. డగౌట్‌ పాండ్‌ పనులకు కూలీల హాజరు గురించి విచారించారు. అనంతరం వేపకుంట, నరసంపల్లిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టారు. దీంతో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిలో గుబులు మొదలైంది. దాదులూరులో పనులపై విచారించామని, వేపకుంట, నరసంపల్లిలో జరిగిన అక్రమాలపై విచారిస్తున్నామని ఏపీడీ తెలిపారు. అక్రమాలు తెలితే చర్యలు తీసుకుంటామని అన్నారు.

Updated Date - 2022-12-02T00:36:04+05:30 IST