High Court: కుండబద్దల సుబ్బారావుపై పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2022-11-17T14:38:46+05:30 IST
అమరావతి (Amaravathi) : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, యూట్యూబర్ కుండబద్దల సుబ్బారావుపై అనంతపురం పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది.
అమరావతి (Amaravathi) : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, యూట్యూబర్ కుండబద్దల సుబ్బారావుపై అనంతపురం పోలీసులు పెట్టిన కేసుపై హైకోర్టు స్టే ఇచ్చింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కాపు రామచంద్రారెడ్డిని విమర్శించారని.. వారిని సీఎం జగన్మోహన్ రెడ్డికి దూరం చేసే అసత్య ప్రచారాలు చేస్తున్నారని కే.రామాంజనేయులు అనే వ్యక్తి గుమ్మగట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కుండబద్దల సుబ్బారావుపై కేసు నమోదు చేశారు.
కేవలం అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న నెపంతో మేజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. తమ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఒక కార్యకర్త రిపోర్టు ఇవ్వడం కూడా చట్ట విరుద్ధమన్నారు. వాదనలు విన్న అనంతరం జస్టిస్ రఘునందన్ రావు ధర్మసనం కేసుపై పూర్తిస్థాయి స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరి 23వ తేదీకి వాయిదా వేశారు.