పంచాయతీ కార్మికులకు వస్త్రాల పంపిణీ
ABN , First Publish Date - 2022-10-24T00:03:45+05:30 IST
దీపావళి పండుగను పురుస్కరించుకుని బుక్కపట్నం మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆదివారం నూతన వస్ర్తాలను పంపిణీచేశారు.
బుక్కపట్నం, అక్టోబరు 23: దీపావళి పండుగను పురుస్కరించుకుని బుక్కపట్నం మేజర్ పంచాయతీ పారిశుధ్య కార్మికులకు టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ ఆదివారం నూతన వస్ర్తాలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామ పారిశుధ్యం కోసం నిరంతరం కృషిచేస్తున్న 26 మంది కార్మికులకు తమ వంతు సాయంగా నూతన దుస్తులను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలు, టీడీపీ నాయకులు సామకోటి ఈశ్వరయ్య, నారాయణస్వామి, రెడ్డికేశి, జేసీబీ చంద్ర, తెలుగుయువత నాయకులు సుధీర్ కుమార్, చంద్ర పాల్గొన్నారు.