అహుడాలోకి మరో ఐదు నియోజకవర్గాలు
ABN , First Publish Date - 2022-11-09T00:05:16+05:30 IST
అనంతపురం-హిందూపురం అర్బన డెవల్‌పమెంట్ అథారిటీలో (అహు డా) కొత్తగా ఐదు నియోజకవర్గాలను చేర్చామని అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. అహుడా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వైస్ చైౖర్మన మురళీకృష్ణ గౌడ్‌తో కలిసి మాట్లాడారు.
చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్
అనంతపురం క్రైం, నవంబరు 8: అనంతపురం-హిందూపురం అర్బన డెవల్‌పమెంట్ అథారిటీలో (అహు డా) కొత్తగా ఐదు నియోజకవర్గాలను చేర్చామని అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్ తెలిపారు. అహుడా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వైస్ చైౖర్మన మురళీకృష్ణ గౌడ్‌తో కలిసి మాట్లాడారు. అహుడా పరిధిలో అనంతపురం నగరపాలక సంస్థ, ధర్మవరం, హిందూపురం, కది రి మున్సిపాలిటీలు, పెనుకొండ నగరపంచాయతీ, 38 మండలాలతో 601 గ్రామాలుగా ఉండేవని, ఇప్పుడు కొత్తగా గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, మడకశిర నియోజకవర్గాలను చేర్చామని తెలిపారు. ప్రస్తుతం ఐదు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ, 398 గ్రామాలు అహుడాలోకి చేరాయని తెలిపారు. మొత్తం 60 మండలాలలోని 999 గ్రామాలతో 17,837 కి.మీ. పరిధికి అహుడా విస్తరించిందని అన్నారు. రాష్ట్రంలో విశాఖ అర్బన డెవల్‌పమెంట్ అథారిటీ తరువాత అధిక విస్తీర్ణం అహుడాదేనని అన్నారు. పుట్టపర్తి అ ర్బన డెవల్‌పమెంట్ అథారిటీ(పుడా) మినహాయించి, మిగిలిన 13 నియోజకవర్గాలను అహుడాలో చేర్చారని వెల్లడించారు. జగనన్న లే ఔట్లు, స్మార్ట్ సిటీలను మధ్యతరగతి ప్రజలకు అనువైన ధరలతో తెస్తున్నామని అన్నారు.