ఘనంగా దీపావళి వేడుకలు

ABN , First Publish Date - 2022-10-25T23:30:10+05:30 IST

మండలవ్యాప్తంగా దీపావళి పర్వ దినాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.

ఘనంగా దీపావళి వేడుకలు

ధర్మవరంరూరల్‌, అక్టోబరు25: మండలవ్యాప్తంగా దీపావళి పర్వ దినాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఇళ్ల ఎదుట ముగ్గులు వేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. టపాసులు పేల్చుతూ ప్రజలు, చిన్నారులు సందడి చేశారు. ఈ సందర్బంగా గ్రామాల్లో అమ్మవారి ఆలయాల్లో విశేషపూజలు చేశారు. గ్రామస్థులు తరలివెళ్లి దర్శించుకున్నారు.

బత్తలపల్లి: మండలవ్యాప్తంగా సోమవారం దీపావళి వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ప్రతిఒక్కరూ బాణాసంచాలు పేల్చుతూ ఆ నందంగా జరుపుకున్నారు. బాణ సంచా విక్రయ కేంద్రాల వద్ద కోనుగోళ్లు చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు.

కదిరిఅర్బన: పట్టణంలో దీపావళి పండుగను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు టపాకాయలు కాల్చారు. కొందరు లక్ష్మీ పూజ చేసి, మిఠాయిలు పంచారు. పలువురు శివాలయంలో గౌరీనోములు నోముకున్నారు.

అమడగూరు: మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గౌరీ నోములను, దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో గౌరీనోము నోచుకున్నారు. మండలకేం ద్రంలోని చౌడేశ్వరీ దేవి కల్యాణమండపంలో సామూహికంగా గౌరి నోము కార్యక్రమం ఏర్పాటు చేశారు. పండితులు నాగేంద్రశర్మ గౌరీ నోము విశిష్టతను వివరించారు. అలాగే అమడగూరు, జౌకల కొత్తపల్లి, ఎ కొత్తపల్లి, వెంకటనారాయణపలిల్లో నోము నోచుకున్నారు.

గంగమ్మకు బోనాలు

నల్లమాడ: మండలకేంద్రంలోని హమాలీ కార్మికులు మంగళ వారం దీపావళి సందర్భంగా గంగమ్మకు జ్యోతులు, బోనాలను సమర్పించా రు. ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనాలను ఎత్తుకుని పురవీధుల్లో ఊరే గింపుగా గుడివద్దకు చేరుకుని గంగమ్మకు సమర్పించారు.

Updated Date - 2022-10-25T23:30:14+05:30 IST