అడవుల పరిరక్షణపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-10-26T23:33:38+05:30 IST
అడవులను పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అడవులను అటవీఅధికారులు పట్టించుకోక పోవడంతో ప్రతి యేటా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నా యి.
పట్టించుకోని అటవీ అధికారులు
ఆవాస ప్రాంతాలు లేక జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు
గాండ్లపెంట, అక్టోబరు 26: అడవులను పరిరక్షణతోనే మానవాళి మనుగడ సాధ్యమనే విషయం అందరికీ తెలిసిందే. అలాంటి అడవులను అటవీఅధికారులు పట్టించుకోక పోవడంతో ప్రతి యేటా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. అడవులు అగ్నికి ఆహుతవుతుండడంతో చెట్లు, పశుగ్రాసం కాలిపో వడంతో పాటు వన్యమృగాలు మృత్యువాత పడుతున్నాయి. అంతేగా కుండా ఆవాసయోగ్యమైన ప్రాంతాలు లేకపోవడంతో వన్యప్రాణులు జనావాసాలలోకి వస్తున్నాయి. మండలవ్యాప్తంగా దాదాపు 8వేల హెక్టార్లల్లో అడవులున్నాయి. గతంలో వర్షాలు లేక అటవీ ప్రాం తాల్లోని చెట్లు, చేమలు ఎండిపోయాయి. రెండేళ్లనుంచి వర్షాలు అధి కంగా కురుస్తుండడంతో చెట్లతోపాటు గడ్డి, చెత్త ఏపుగా పెరుగుతున్నాయి. వేసవి వచ్చేసరికి ఆకతాయిలు కొం డలకు నిప్పు పెడు తున్నారు. దీంతో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతై. వన్యమృగాలు, చెట్లు కాలిపోతు న్నాయి. అటవీశాఖాధికారులు విలువైన అటవీ సంపదను, వన్యమృ గాలను సంరక్షించుకోవడానికి ఫైర్‌లైన్లను ఏర్పాటు చేయకపోవడంతో అడవులన్నీ కాలిపోతు న్నాయి. దీంతో వన్యమృగాలకు నివాసాలు లేకపోవడం వల్ల అవి ఏకంగా జనావాసాల్లోకి చేరుతున్నాయి. ఇప్పటి కే పలు గ్రామాల సమీపంలో గుంపులుగుంపులుగా నెమళ్లు, జింకలు, అడవి పందుల సంచారం ఎక్కువగా ఉంది. మండలకేంద్రానికి చుట్టు పక్కల నిత్యం జింకల గుంపులు సంచరిస్తున్నాయి. వీటికి అడవుల్లో రక్షణ కరువు కావడంతో గ్రామాల పరిసరాల్లోకి వస్తూ, పంటలను నష్టపరుస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అడవులను పరిరక్షిస్తే అటవీ సంపదతో పాటు, జంతులకు ఆవాసాలు ఉంటాయి. ఇదిలా ఉండగా అధికారులు వన్యమృగాలు, అటవీ సంపద పరిరక్షణలో చొరవ చూపకపోవడంతో వన్య ప్రాణాలు వేటగాళ్ల బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అటవీ అధికారులు అడవులను పరిరక్షించడంతో పాటు వన్య ప్రాణులు అంతరించకుండా చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భావితరాలవారికి వన్యప్రాణులను పుస్తకాల్లో మాత్రమే చూపించాల్సిన దుస్థితి నెలకుంటుందని ప్రజలంటున్నారు.
నిధుల కొరత.. - షామీర్ బాషా, అటవీశాఖ సెక్షన అధికారి
అడవుల పరిరక్షణ కోసం ఫైర్‌లైన్ల ఏర్పాటుకు నిధుల కొరత ఉంది. దీంతో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. గత రెండు సంవత్సరాల నుంచి వర్షాలు బాగా కురవడంతో బోద ఏపుగా పెరుగుతోంది. దానికి ఆకతాయిలు నిప్పు పెడుతుండడంతో అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్ని వలన కూడా కొంతమేర ఉపయోగముంది. ఈయేడాది నిధులు వస్తే ఫైర్‌లైన్లు ఏర్పాటు చేసి, అడవులను పరిరక్షిస్తాం.