అర్హుల జాబితా ప్రదర్శనపై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2022-11-20T23:58:10+05:30 IST
రైతుభరోసా కేంద్రాల్లో 2020-21 రబీ సీజనలో పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీకి అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించడంపై వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఆర్బీకేల్లో కానరాని సున్నా వడ్డీ రాయితీ జాబితా
రేపటితో ముగియనున్న అభ్యంతరాల స్వీకరణ గడువు
అనంతపురం అర్బన, నవంబరు 20: రైతుభరోసా కేంద్రాల్లో 2020-21 రబీ సీజనలో పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీకి అర్హులైన రైతుల జాబితా ప్రదర్శించడంపై వ్యవసాయ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 22వతేదీ వరకు జాబితాలు ప్రదర్శించంతోపాటు అభ్యంత రాలుంటే తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 2020-21 రబీ సీజనలో 6613 మంది రైతులకు రూ.49.36 లక్షల సున్నా వడ్డీ వర్తింపజేశారు. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో ఆర్బీకేలకు సున్నా వడ్డీ అర్హులైన రైతుల జాబితాను పంపినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నా క్షేత్ర స్థాయిలో ఆ విషయాన్ని రైతులకు తెలియ జేయడంలో స్థానిక అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిం చడం విమర్శలకు తావిస్తోంది. అభ్యంతరాలకు మరో రెండు రోజులే అవకాశం ఉంది. రైతులకు జాబితా ప్రదర్శన విషయాన్ని తెలియజేసి అభ్యంతరాలు ఇచ్చేందుకు సదుపాయం కల్పించాల్సి ఉంది. మరి ఏ మేరకు వ్యవసాయ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.