గజగౌరికి చక్కెర హారతులు
ABN , First Publish Date - 2022-11-10T23:39:40+05:30 IST
మండలంలోని ఉద్దేహాళ్, ఉంతకల్లు, హరేసముద్రం, దేవగిరి క్రాస్, శ్రీధరఘట్ట తదితర గ్రా మాలలో గురువా రం గజగౌరీ, కడ్లేగౌరమ్మ వేడుకల్లో భాగంగా గురువారం చక్కెర హారతు ల కార్యక్రమం వైభవంగా జరిగింది.
బొమ్మనహాళ్, నవంబరు 10: మండలంలోని ఉద్దేహాళ్, ఉంతకల్లు, హరేసముద్రం, దేవగిరి క్రాస్, శ్రీధరఘట్ట తదితర గ్రా మాలలో గురువా రం గజగౌరీ, కడ్లేగౌరమ్మ వేడుకల్లో భాగంగా గురువారం చక్కెర హారతు ల కార్యక్రమం వైభవంగా జరిగింది. బాలికలు, ఆడపడు చులు, మహిళ లు చక్కెర హారతులు తీసుకుని గజగౌరీ, కడ్లేగౌరమ్మకు విశేషపూజలు జరిపించారు. ఉత్సాహంగా ఆలయానికి చేరుకుని హారతులు పట్టారు.
డి హీరేహాళ్: మండలంలోని వివిధ గ్రామాలలో గౌరీ పండుగ వేడు కలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీదేవి విగ్రహాన్ని ప్రతి ష్ఠించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం ఆయా గ్రామాలలోని ఆడపడుచులు హారతులు పట్టారు.