ఇది ప్రభుత్వ వైఫల్యం

ABN , First Publish Date - 2022-12-01T00:45:08+05:30 IST

వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ విమర్శించారు. సేవాఘడ్‌లోని గిరిజన గురుకుల పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌తో మాట్లాడారు.

ఇది ప్రభుత్వ వైఫల్యం
ప్రిన్సిపాల్‌తో మాట్లాడుతున్న జితేంద్ర గౌడ్‌

మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌

గుత్తి, నవంబరు 30: వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులను కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌ జితేంద్ర గౌడ్‌ విమర్శించారు. సేవాఘడ్‌లోని గిరిజన గురుకుల పాఠశాలను ఆయన బుధవారం సందర్శించారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను పరామర్శించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌తో మాట్లాడారు. డార్మెటరీ గదులలో ఎందుకు మౌలిక వసతులు కల్పించలేదని ప్రశ్నించారు. గదులకు తలుపులు, కిటికీలు సరిగా లేవని, రాత్రిపూట ఎలుకలు చొరబడి విద్యార్థులను కరుస్తుంటే ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడు కింద పాఠశాలలు, వసతి గృహాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని సీఎం జగన అంటున్నారని, కానీ ఇక్కడ ఎలుకలు కరిచి విద్యార్థులు ఆసుపత్రి పాలౌవుతున్నారని జితేంద్రగౌడ్‌ విమర్శించారు. తక్షణమే అధికారులు వసతి గృహంలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, ఎలుకలు కరిచిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్‌ అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాయల రామయ్య, మాజీ ఎంపీటీసీ తలారి మస్తానప్ప, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, బీసీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు టి కేశప్ప, తెలుగు యువత నాయకులు తలారి శివ, మారెన్న, బుషి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-01T00:45:36+05:30 IST