‘అలా చేయడం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే’
ABN , First Publish Date - 2022-11-22T15:49:52+05:30 IST
అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే రౌడీసేన అంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మండిపడ్డారు.
విశాఖ: అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకే రౌడీసేన అంటున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మండిపడ్డారు. జనసేనకు (Janasena) సీఎం జగన్ (CM Jangan) సర్టిఫికెట్ ఏం అవసరం లేదన్నారు. జగన్ రెడ్డి తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్‌పై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. మహిళల చున్నీలు తీయించడం వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు. మహిళల చున్నీలు తీయించిన ఘటనకు జగన్‌రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.