Home » CM Jagan
గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన హత్యను టీడీపీకి ఆపాదిస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. వ్యక్తిగత హత్యలను టీడీపీపై రుద్దడం ఆయనకే చెల్లుబాటు అవుతోందని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
ముఖ్యమంత్రి హోదాలో జగన్ తాడేపల్లిలోని సొంత ఇంటినే క్యాంపు ఆఫీసుగా మార్చేసుకొని సకల రాజభోగాలు అనుభవించారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో సకల ఆడంబరాలు, వసతులు కల్పించుకున్నారు. సచివాలయానికి వెళ్లకుండానే ఇంటి నుంచే వ్యవహారం నడిపించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం ఎంత ఖర్చు చేసినా ఎవరూ తప్పుపట్టరు.
జగన్ ప్రభుత్వ విధ్వంస పాలనకు ప్రతీకగా ‘ప్రజావేదిక’ శిథిలాలను అలాగే ఉంచాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. సరిగ్గా ఐదేళ్ల కిందట జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రజా వేదికను బుల్డోజర్లు, పొక్లెయిన్లతో జగన్ కూలగొట్టించిన విషయం తెలిసిందే.
మీడియా దిగ్గజం రామోజీరావు మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రామోజీ రావు మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తెలుగు మీడియా రంగానికి రామోజీ రావు ఎనలేని సేవలు అందించారని గుర్తుచేశారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనపై సమతా సైనిక్ దళ్ (Samata Sainik Dal) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలేటి ఉమామహేశ్వరరావు (Paleti Umamaheswara Rao), పిల్లి సురేంద్రబాబు (Pilli Surendra Babu) నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన అంతమొందించడానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కలిసికట్టుగా కృషి చేశారంటూ సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి ఉమామహేశ్వరరావు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగిస్తోంది. వాస్తవానికి రాయలసీమ వైసీపీకి అడ్డా. ఇప్పుడు ఇక్కడంతా టీడీపీ హవా నడుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కడప, మైదుకూరు, రాయచోటి, జమ్మలమడుగులో టీడీపీ ముందంజలో ఉంది. బద్వేలులో వైసిపీ అభ్యర్థి 1483 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య(Varla Ramaiah) సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల నోఫికేషన్ తర్వాతే సీఎం జగన్ రానున్న రూ.4వేల కోట్లతో కలిపి దాదాపు రూ.25వేల కోట్ల అప్పులు(25 Thousand Crore Loans) చేశారని తెలిపారు.
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) సుప్రీంలో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్‌పై సోమవారం సుప్రీంలో విచారణ జరగనుంది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరుగుతంది. పోస్టల్ బ్యాలెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.