రోడ్డు ఎక్కిన ఏనుగుల గుంపు
ABN , First Publish Date - 2022-12-26T01:52:22+05:30 IST
గుడియాత్తం రహదారిలో ఆదివారం 12 ఏనుగుల మంద దాదాపు 30 నిమిషాల పాటు హల్‌చల్ చేశాయి. మందను గమనించిన వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
పలమనేరు- గుడియాత్తం రహదారిలో ఆదివారం 12 ఏనుగుల మంద దాదాపు 30 నిమిషాల పాటు హల్‌చల్ చేశాయి. మందను గమనించిన వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, ట్రాకర్సు సంఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద ఏనుగులను అటవీ లోతట్టు ప్రాంతానికి తరిమివేశారు. విద్యుత్ కంచె పూర్తి స్థాయిలో నిర్మించక పోవడంతో ఏనుగులు తరచూ అటవీ ప్రాంతంనుంచి వెలుపలకు వచ్చి ఇలా రహదారిపై అటుఇటూ తిరుగుతున్నాయి. దీంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
- పలమనేరు