ప్రభుత్వ ఆమోదం కోసం చిత్తూరు మాస్టర్‌ప్లాన్‌

ABN , First Publish Date - 2022-07-14T06:45:37+05:30 IST

చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా) అథారిటీ మొదటి సమావేశం చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం చుడా కార్యాలయంలో జరిగింది. చిత్తూరు నగరాభివృద్ధికోసం ఇటీవల ప్రకటించిన మాస్టర్‌ప్లాన్‌-2041 అభ్యంతరాలు, సలహాలపై అథారిటీ సమావేశంలో సభ్యులు చర్చించారు.

ప్రభుత్వ ఆమోదం కోసం చిత్తూరు మాస్టర్‌ప్లాన్‌
సమావేశానికి హాజరైన అధికారులు

చిత్తూరు, జూలై 13: చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా) అథారిటీ మొదటి సమావేశం చైర్మన్‌ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన బుధవారం చుడా కార్యాలయంలో జరిగింది. చిత్తూరు నగరాభివృద్ధికోసం ఇటీవల ప్రకటించిన మాస్టర్‌ప్లాన్‌-2041 అభ్యంతరాలు, సలహాలపై అథారిటీ సమావేశంలో సభ్యులు చర్చించారు. చుడా వైస్‌చైర్మన్‌ విశ్వనాథ్‌ నిర్వహించిన సమావేశానికి సభ్యుల హోదాలో కలెక్టర్‌ హరినారాయణన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. మాస్టర్‌ ప్లాన్‌-2041పై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులు, డీటీసీపీ ద్వారా చేపట్టిన చర్యలపై చర్చించారు. అనంతరం మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం కోసం నివేదించారు. చిత్తూరు పట్టణాభివృద్ధికి అదనపు నిధులను కేటాయించాలని, రూరల్‌ ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేసేందుకు అనుమతులు కోరుతూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ, ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ, టూరిజం మేనేజర్‌, ఇండస్ట్రియల్‌ జీఎం, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈలు, పట్టణ ప్రణాళిక రీజనల్‌ డైరెక్టర్‌ దేవీకుమారి, కార్యదర్శి మధు, ఈఈ తులసీరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Updated Date - 2022-07-14T06:45:37+05:30 IST