‘ఫ్యామిలీ డాక్టర్’ను సమర్థంగా అమలుచేయాలి
ABN , First Publish Date - 2022-12-20T23:19:04+05:30 IST
ఆస్పత్రుల్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 20: ఆస్పత్రుల్లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న వైద్యపర పథకాలపై ఆయన సమీక్షించారు. క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు, సిబ్బంది వైద్యసేవలను విస్తృతం చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా బాలింతల్లో రక్తహీనత లేకుండా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వాస్పత్రుల్లో సుఖప్రసవం జరిగేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో ప్రకాశం, వివిధ విభాగాల వైద్యాధికారులు పాల్గొన్నారు.
93శాతం డ్రోన్ సర్వే పూర్తి
భూరీసర్వే కార్యక్రమంలో భాగంగా 93శాతం డ్రోన్ సర్వే 763 గ్రామాల్లో జరిగినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లు, సర్వే డీటీలు, రెవిన్యూ సిబ్బందితో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 236 గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐ షీట్లు రాగా, 125 గ్రామాల్లో క్వాలిటీ తనిఖీలు పూర్తయినట్లు తెలిపారు. 116 గ్రామాల పరిధిలో సర్వే పూర్తిచేసిన భూయజమానులకు సరిహద్దులు నిర్ణయించే సర్వేరాళ్లు నాటేందుకు ఇండెంట్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు 14 గ్రామాల్లో సర్వేరాళ్లు నాటడం పూర్తయిందన్నారు. రీసర్వే త్వరితగతిన పూర్తిచేసేందుకుగాను మండలానికొక డీటీ చొప్పున నియమించినట్లు జేసీ వెంకటేశ్వర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే అక్కడికక్కడే డీటీలు పరిష్కరించే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.