దెబ్బతిన్న పంటలకు సత్వర పరిహారం
ABN , First Publish Date - 2022-12-14T23:25:10+05:30 IST
తుఫాన్ కారణంగా పంటలను పోగొట్టుకున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుం దని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం వి.కోట మండల పరిధిలో మాండస్ కారణంగా దెబ్బతిన్న పంట లను కలెక్టర్ హరినారాయణన్‌తో కలసి ఆయన పరిశీలించారు.
వి.కోట, డిసెంబరు 14: తుఫాన్ కారణంగా పంటలను పోగొట్టుకున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుం దని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు అన్నారు. బుధవారం వి.కోట మండల పరిధిలో మాండస్ కారణంగా దెబ్బతిన్న పంట లను కలెక్టర్ హరినారాయణన్‌తో కలసి ఆయన పరిశీలించారు. మొక్కజొన్న, బంగాళదుంప, మల్బరీ, బీన్స్, టమోటా సహా ఇతర పంటల నష్టాన్ని అంచనా వేసి పంపాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పట్ర పల్లె వద్ద వానతో దెబ్బతిన్న బంగాళదుంప పంట దిగుబడి సమయంలో ఎక్కువ వర్షపా తం కారణంగా గడ్డలన్నీ కుళ్ళిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దబరిణేపల్లె పంచాయతీ జంగంగురవేపల్లె వద్ద దెబ్బతిన్న పంటను పరిశీలించారు. మొక్కజొన్న కంకులు దిగేసమయంలో గాలీవానల కారణంగా నేల మట్టమయ్యాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నెర్నపల్లె పంచాయతీ రామాపురం వద్ద మల్బరీ తోటలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు-నేడు పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా షికారీలు తమకు పక్కా నివా సాలు లేవని విన్నవించడంతో సమీపం లోని ప్రభుత్వ భూమిలో 25 మందికి ఇంట్టి పట్టాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపీపీ యువరాజ్, ఇన్‌చార్జి తహసీల్దార్ కుమార స్వామి, ఎంపీడీవో బాలాజీ, ఏవో రాజ్యలక్ష్మీ, డీటీ దినేష్, ఆర్‌ఐ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ కమల్‌నాథ, సర్పంచ్ శ్రీనివాసులు ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.