అటెండర్ ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-09-21T05:06:02+05:30 IST
వెంకటగిరిలోని వల్లివేడు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగురాలైన సయ్యద్ సలీమా మంగళవారం పాఠశాలలోనే మత్తుమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది.
వెంకటగిరి, సెప్టెంబరు 20: వెంకటగిరిలోని వల్లివేడు క్రాస్ రోడ్డు సమీపంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగురాలైన సయ్యద్ సలీమా మంగళవారం పాఠశాలలోనే మత్తుమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకొన్న సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సలీమా తల్లిదండ్రులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని ప్రిన్సిపాల్ షాహినా వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించినట్లు ఆరోపించారు. ప్రిన్సిపల్ షాహినా మాట్లాడుతూ సిబ్బందిని తమ విదులు సక్రమంగా నిర్వహించమనడమే తప్ప తాను ఏనాడూ వేధించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సలీమా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.