తిరుమల నిత్యాన్నదానానికి 10టన్నుల కూరగాయల వితరణ
ABN , First Publish Date - 2022-04-16T05:16:42+05:30 IST
తిరుమల వెంగమాంబ సత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా మాలూరుకు చెందిన మునివెంకటస్వామి అనే భక్తుడు శుక్రవారం 10 టన్నుల వివిధ రకాల కూరగాయలను వితరణగా అందజేశారని పలమనేరు మండలం కాప్పల్లి గ్రామానికి చెందిన శ్రీవారి భక్తుడు రవీంద్రరెడ్డి తెలిపారు.
పలమనేరు, ఏప్రిల్15 : తిరుమల వెంగమాంబ సత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా మాలూరుకు చెందిన మునివెంకటస్వామి అనే భక్తుడు శుక్రవారం 10 టన్నుల వివిధ రకాల కూరగాయలను వితరణగా అందజేశారని పలమనేరు మండలం కాప్పల్లి గ్రామానికి చెందిన శ్రీవారి భక్తుడు రవీంద్రరెడ్డి తెలిపారు. ఆయనతో పాటు మాలూరుకు చెందిన శ్రీవారిభక్తులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌లు కూడా కూరగాయలను తిరుమల నిత్యాన్న దానానికి అందజేశారని రవీంద్రరెడ్డి తెలిపారు. తిరుమలలో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో నిత్యాన్నదానానికి తమవంతు సహకారంగా కూరగాయలను పంపించడం తమ పూర్వజన్మ సుకృతమని వారు పేర్కొన్నారు. కూరగాయలను ప్రత్యేక వాహనాల్లో నింపి పూజలు చేసి తిరుమలకు పంపించారు.