ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం

ABN , First Publish Date - 2022-12-16T00:52:39+05:30 IST

తూర్పు రాయలసీమ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల నమోదుపై అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 15: తూర్పు రాయలసీమ పరిధిలోని మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్ల నమోదుపై అందిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. గురువారం సాయంత్రం ముఖ్య ఎన్నికల అధికారి ముఖే్‌షమీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. చిత్తూరు నుంచి హరినారాయణన్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు ఎన్‌రోల్‌మెంట్‌ అధికారిగా డీఆర్వో రాజశేఖర్‌ నియమితులయ్యారన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఫొటో సంక్షిప్త సవరణ కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదుకు 30వేల దరఖాస్తులు అందగా, 22,483 పరిశీలించామని వివరించారు. మిగిలిన వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:52:43+05:30 IST