రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు
ABN , First Publish Date - 2022-11-14T00:36:47+05:30 IST
రంగంపేట మండలం వడిశలేరులో ఆదివారం జీఎస్‌ఎల్ చైర్మన్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి.
బిక్కవోలు, నవంబరు 13: రంగంపేట మండలం వడిశలేరులో ఆదివారం జీఎస్‌ఎల్ చైర్మన్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఎంపీ భరత్‌రామ్, ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఎడ్లబండిని నడిపి పోటీలను ప్రారంభించారు. హోం శాఖ మంత్రి తానేటి వనిత పోటీలను వీక్షించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో 13 జతల ఎడ్లు పాల్గొన్నాయి. వీటిని 1600 మీటర్ల దూరం పరిగెత్తించగా, విజయనగరం జిల్లా వావిలాలపాడు నుంచి వచ్చిన గండి వెంకటరావు ఎడ్లు ప్రథమస్థానం సాధించాయి. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన గుణ్ణం శ్రీరామతేజ, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన వేగుళ్ల పుష్పరాజ్ ఎడ్లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. ప్రథమ విజేతకు బుల్లెట్, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించనవారికి ఎలక్ట్రికల్ బైక్‌లను బహుమతులుగా అందించారు. జూనియర్ విభాగంలో 50 జతల ఎడ్లు పాల్గొన్నాయి. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన బచ్చా జియమ్స్ ఎడ్లు ప్రథమస్థానం సాధించగా, అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన వేగుళ్ల కృష్ణలిఖిత, మడికి చెందిన పాలూరి సతీష్ ఎడ్లు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించాయి. కార్యక్రమంలో నిర్వాహకులు కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజిరావు తదితరులు పాల్గొన్నారు.