చంద్రబాబు వస్తేనే భవిష్యత్‌

ABN , First Publish Date - 2022-11-29T00:47:28+05:30 IST

రాష్ట్రం అభి వృద్ధిలో వెనుకబడిందని..దానిని గాడిన పెట్టే నాయకుడు చంద్రబాబేనని.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ అన్నారు.

చంద్రబాబు వస్తేనే భవిష్యత్‌
ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న జవహర్‌, రామకృష్ణారెడ్డి, శేషారావు

ఉండ్రాజవరం, నవంబరు 28 : రాష్ట్రం అభి వృద్ధిలో వెనుకబడిందని..దానిని గాడిన పెట్టే నాయకుడు చంద్రబాబేనని.. ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ అన్నారు. మండలంలోని వేలి వెన్ను గ్రామంలో సోమవారం నిర్వహించిన నిడదవోలు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేతక పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలు పునిచ్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల న్నారు.ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లా డుతూ ప్రభుత్వం చెప్పే వికేంద్రీకరణ వల్ల అభి వృద్ధి అనేది అవాస్తమని తెలిపారు. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటు న్నారని చెప్పారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కార్య కర్తలు పార్టీ విజయానికి నిరంతరం పనిచేయా లన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నియో జకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ప్రభాకర్‌ మాట్లాడుతూ చంద్రబాబు శపథాన్ని మనందరి శపథంగా భావించి సీఎంను చేసి అసెంబ్లీకి పంపాలన్నారు.తొలుత స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, ఉండ్రాజ వరం,పెరవలి, నిడదవోలు మండల పార్టీ అధ్య క్షులు సింహాద్రి రామకృష్ణ,అతికాల రామకృష్ణమ్మ (శ్రీను),వెలగన సూర్యారావు పాల్గొన్నారు.

బీసీలకు టీడీపీలోనే పెద్దపీట..

కొవ్వూరు, నవంబరు 28 : రాజకీయంగా బలహీనవర్గాల్లోని అన్ని కులాలకు అత్యధిక ప్రాధా న్యత ఇచ్చిన ఘనత అన్న ఎన్‌టీఆర్‌కే దక్కుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కె.ఎస్‌. జవహర్‌ అన్నారు.కొవ్వూరులోని రాజమహేంద్రవరం టీడీ పీ కార్యాలయంలో సోమవారం యాదవ, శెట్టిబలిజ, శ్రీశయన, ఎంబీసీ సాధికారత సమితి కన్వీనర్లతో చంద్రబాబు పర్యటనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్‌ టీడీపీ పునాదులన్నీ బీసీలతో వేశారన్నారు.అదే స్ఫూర్తిని చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. 54 బీసీ కార్పొరేషన్లలోని లోపాలను సరిచేసేందుకే టీడీపీ సాధికారత కమిటీలు వేసిందన్నారు. సాధికారత కమిటీల ద్వారా వచ్చిన అభ్యర్థనలను మేనిపెస్టోలో పెడతారన్నారు.చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన విజయవంతం చేయాలన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు జగన్‌ పాలనపై అసంపూర్తితో ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ, శెట్టిబలిజ, శ్రీశయన, ఎంబీసీ సాధికారత సమితి రాష్ట్ర కన్వీనర్లు పి.నాగేశ్వరరావు,కుడుపూడి సత్తిబాబు, పట్నాల వెంకటేష్‌, రమేష్‌, కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-29T00:47:31+05:30 IST