3న జగన్ రాక
ABN , First Publish Date - 2022-12-27T01:15:19+05:30 IST
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే జనవరి 3న రాజమహేంద్ర వరం రానున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. దీనికోసం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వచ్చే జనవరి 3న రాజమహేంద్ర వరం రానున్నారు. కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తారు. దీనికోసం ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాధవీలత సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలని, ఈనేపథ్యంలో ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకూ అధికారులకు, సిబ్బందికి ఎటువంటి సెలవులు మంజూరు చేయలేమని స్పష్టంచేశారు. అలాగే సోమవారం రాత్రి జేసీ ఎన్.తేజ్‌భరత్, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్ కలసి కలెక్టర్ సమీక్షించారు. మూడో విడత పింఛను పెంపు కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించి, లబ్ధిదార్లతో ముఖాముఖీ నిర్వహిస్తారని తెలిపారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ సౌకర్యం, ప్రజల సౌకర్యా ర్థం రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.