మహారాణీ ఆశయ సాధనకు కృషి
ABN , First Publish Date - 2022-11-22T23:54:03+05:30 IST
మహారాణీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహుద్దూర్ మహారాణీ 187వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబుతో పాల్గొన్నారు. ముందుగా సత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ అధ్వర్యంలో మహారాణీ విగ్రహానికి పూ
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం నవంబరు 22: మహారాణీ ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహుద్దూర్ మహారాణీ 187వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన రాష్ట్ర హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబుతో పాల్గొన్నారు. ముందుగా సత్రం ఈవో కాట్నం జగన్మోహన శ్రీనివాస్ అధ్వర్యంలో మహారాణీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజప్ప మాట్లాడుతూ బాటసారులు, అన్నార్తులు, నిరుపేదల ఆకలిబాధను తీర్చేందుకు 18వ శతాబ్దంలో సత్రాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా గర్వకారణమన్నారు. దొరబాబు మాట్లాడుతూ ఎంతోమంది నిరుపేదల ఆకలితీర్చినమహారాణీ ఆశయాన్ని నెరవేర్చే దిశగా అంతా కృషి చేయాలన్నారు. నాటి నుంచీ నేటి వరకూ నిరాటంకంగా ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం జరగడం గొప్ప విషయ న్నారు. నిరుపేదలకు వారు వస్త్రదానం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసీమంగతాయారు, ఎంపీపీ పెంకే సత్యవతి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, కౌన్సిలర్లు త్సలికి సత్యభాస్కరరావు, అరెళ్ల వీర్రాఘవరావు, కోఆప్షన్ సభ్యుడు వాసంశెట్టి గంగ పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదు వేగవంతం
వార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఎమ్మెల్యే చినరాజప్ప కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. టీడీపీ రాష్ట్ర కార్యదిర్శి కాకినాడ రామారావు, మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), పాలకుర్తి శ్రీనుబాబు, కందుల విశ్వేశ్వరరావు, నూనే రామారావు, అడబాల కుమారస్వామి, తూతికరాజు పాల్గొన్నారు.